Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

రుద్రంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – రుద్రంగి
వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.గ్రామంలోని నందివాగు బ్రిడ్జి వద్ద ఆదరవేని వెంకటి అనే వ్యక్తి మంగళవారం శుభ కార్యం నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళాడు. అలా వెళ్లిన వ్యక్తి బుధవారం తెల్లవారు జామున నంది వాగు బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. అటుగా వెళ్లిన వాహనదారులు ఇది గమనించి కుటుంబ సభ్యులకు,పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటి ని శుభకార్యానికి తీసుకు వెళ్లిన యువకుడిని అదుపులోకి తీసుకుని ఇది ప్రమాదమా లేక ఎవరైనా చంపి పడవేశారా అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -