- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం కొత్తపేట గ్రామం చెందిన ఆత్రం భీము (30) ఆదివారం ఉదయం కొత్తపేట చెరువు అలుగు రావడంతో చేపలు పట్టెందుకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో కాలుజారి నీటిలో మునిగా మృతి చెందాడు. రాగికుంటకు వెళ్లేవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతుని తండ్రి అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -