నవతెలంగాణ – రాజోలి : రాజోలి మండల పరిధిలోని మాన్ దొడ్డి గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలను పథకాలను ఉద్దేశించి గ్రామస్తులకు తెలియజేశారు. ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు అధికారులు కొన్ని సూచనలు తెలియజేశారు. అలాగే త్వరలో రానున్న కొత్త పింఛన్ల గురించి గ్రామస్తులకు తెలిపారు ఇందులో ఆ పథకాల కు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించగా మరికొందరు గ్రామస్తులు వర్షం వ్యక్తం చేశారు. గ్రామ సభలో ఉప సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఇరువర్గాల మధ్యన స్వల్ప ఘర్షణ ఏర్పడింది. ఘర్షణ పట్ల అధికారులు గ్రామస్తులపై మండిపడ్డారు. గ్రామ సభలో ఘర్షణాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామసభనుగ్రామ సభను నిర్వహించడం మంచిదని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత బాబురావు, ఉప సర్పంచ్ భీమన్న, గ్రామ వార్డ్ మెంబర్లు, పశు వైద్యాధికారి పాలాగు, వ్యవసాయ అధికారి శ్వేత, గ్రామపంచాయతీ కార్యదర్శి వీరేష్, ఏపీఎస్ స్పెషల్ అధికారి కోటేశ్వరి మరియు ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు
మాన్ దొడ్డి గ్రామసభ విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



