నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష పడిందాన్ని అయిదవ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 18-11-2025 నాడు వర్ని చౌరస్తా దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 5వ టౌన్ గంగాధర్ తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా షేక్ సుల్తాన్ అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించి, కోర్టు యందు ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్ ఏడు రోజులు జైలు శిక్ష విధించారు. ఈ వ్యక్తిని జైలు కు తరలించడం జరిగింది. పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ 10,000/- వరకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు కూడా విదించే అవకాశం ఉంది కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని పోలీస్ వారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 7 రోజుల జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



