గూడూరులో విషాదం
నవతెలంగాణ -పాలకుర్తి
మండలంలో ని గూడూరు గ్రామానికి చెందిన జ్యోతి సోమయ్య 65, ఈనెల 14 న గూడూరు రాఘవపురం గ్రామాల మధ్య సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. సోమయ్య కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాఘవపురం గ్రామ స్టేజి సమీపంలో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గూడూరుకు సోమయ్య నడుచుకుంటూ వస్తుండగా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన గిరగాని సాయి అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుతూ సోమయ్యను ఢీకొట్టాడని తెలిపారు.
తీవ్రంగా గాయపడిన సోమయ్య అపస్మారక స్థితిలో చేరుకోవడంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండ లో గల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమయ్యకు మరింత మెరుగైన వైద్యం అందించాలని ప్రైవేట్ వైద్యుల సూచనల మేరకు ఎంజీఎం కు తరలించామని, చికిత్స పొందుతూ సోమయ్య మృతి చెందడంతో గూడూరులో విషాదం నెలకొంది. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు ఈనెల 14 న కేసు నమోదు చేశామని పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గూడూరు గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES