- Advertisement -
నవతెలంగాణ ముత్తారం:
ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు. పారుపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి సదానందం అసభ్యంగా ప్రవర్తించాడని, మైనర్ బాలికల తల్లిదండ్రులు ముత్తారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిపి మల్లారెడ్డి, ముత్తారం ఎస్‌ఐ గోపతి నరేష్ విచారణ చేపట్టి సదానందంను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు.
- Advertisement -