Thursday, January 8, 2026
E-PAPER
Homeక్రైమ్డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో బషీరాబాద్ గ్రామానికి చెందిన సక్కారం శంకర్ కు ఆర్మూర్ అడిషనల్ జ్యుడీషియల్  ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ భవ్యశ్రీ ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న బషీరాబాద్ గ్రామానికి చెందిన సక్కారం శంకర్ ను పట్టుకుని బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నాడని రిపోర్టు  రాగా అతడిని ఆర్మూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. అడిషనల్ జ్యుడీషియల్  ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  భవ్యశ్రీ అతడికి ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్ఐ జి. అనిల్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలను నడపొద్దున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడే ఆస్కారం కూడా ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -