Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు 

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాలను ప్రకారం 21వ తేదీ రాత్రి కుమార్ గల్లీ దగ్గర వాహనాల తనిఖీలు చేయుచుండగా పాముల బస్తీ నిజామాబాద్ కు చెందిన శివకుమార్ వృతి కూలి అధికంగా మద్యం సేవించి తన వాహనం నడుపుతూ పట్టుబడినాడు. ఈ వ్యక్తిని బుధవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా అట్టి వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు. ఉత్తర్వుల ప్రకారం ఇతన్ని జైలుకు పంపిించామన్నారు.  ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -