- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన రాజేందర్ మార్కెట్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలైన రాజేందర్ ను 108 అంబులెన్స్ ఈఎంటి యాదగిరి, పైలట్ రాజయ్య అత్యవసర చికిత్స నిర్వహించి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -