- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైని 34 మానవబాంబులతో పేల్చేస్తామంటూ శుక్రవారం వాట్సాప్ మెసేజ్‌లతో కలకలం సృష్టించిన 51 ఏళ్ల అశ్విని కుమార్‌ను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన అతడు జ్యోతిష్యుడు, వాస్తు కన్సల్టెంట్. 3 సిమ్ కార్డులు, 7 ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జైలులో ఉన్న ఇతడు, పాత విభేదాల కారణంగానే ఈ బెదిరింపులు పంపినట్టు దర్యాప్తులో తెలిసింది.
- Advertisement -