Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెన్సార్ పూర్తి చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కోతలు లేకుండా క్లీన్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సెన్సార్ పూర్తవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా, కుటుంబమంతా కలిసి చూసేలా ఉందని సెన్సార్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ క్లీన్ కామెడీతో, ఎక్కడా డబుల్ మీనింగ్ సంభాషణలు లేకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక, సినిమా నిడివిని మేకర్స్ 2 గంటల 42 నిమిషాలుగా లాక్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -