Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeసినిమాపాట చిత్రీకరణలో 'మన శంకరప్రసాద్‌ గారు'

పాట చిత్రీకరణలో ‘మన శంకరప్రసాద్‌ గారు’

- Advertisement -

చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి మోస్ట్‌ ఎవైటెడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, నయనతార, ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్ట్‌ షూటింగ్‌లో చిత్ర బృందం బిజీగా ఉంది.
నేటి (సోమవారం) చిరంజీవి, నయనతారలపై ఒక పాటను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. చార్ట్‌బస్టర్‌, మాస్‌-అప్పీల్‌ ట్రాక్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్‌ మాస్టర్‌ విజరు పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు. ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌, వినాయక చవితి స్పెషల్‌ పోస్టర్‌ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. చిరంజీవిని స్టైలిష్‌ బెస్ట్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేయడం అభిమానులను అలరించింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా దీన్ని అత్యంత భారీగా రిలీజ్‌ చేస్తున్నాం అని మేకర్స్‌ తెలిపారు. చిరంజీవి, నయనతార, విటివి గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – అనిల్‌ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ – సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌ – తమ్మిరాజు, రచయితలు – ఎస్‌ కష్ణ, జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌ కష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్‌ – నవీన్‌ గారపాటి, ఎడిషినల్‌ డైలాగ్స్‌ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad