Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎంపీటీసీని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

మాజీ ఎంపీటీసీని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిప్పేర అనిల్ ను, కుటుంబ సభ్యులను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం  పరామర్శించారు. ఇటీవల అనిల్ సతీమణి వినోద అనారోగ్యంతో మరణించడంతో విషయాన్ని తెలుసుకున్న మోహన్ రెడ్డి వారిని పరామర్శించారు.

అనిల్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వినోద అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్పంచ్ ఏనుగందుల శైలెందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, నాయకులు సుంకరి విజయ్ కుమార్, అవారి సత్యం, ఏలేటి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -