నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొడిమ్యాల సత్యగౌడ్ ను సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల సత్య గౌడ్ అమ్మ కొడిమ్యాల రాజవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మోహన్ రెడ్డి సత్య గౌడ్ ను,వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజవ్వ అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, నాయకులు మారుపాక నరేష్, పత్రి రవి, బద్దం నాగేష్, సాదుల్లా, రాకేష్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



