నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పలు కుటుంబాలను జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార కార్పోరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి తండ్రి బద్దం భూమన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు.రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయన వారి కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బద్ధం భూమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన డాకూరి బ్రహ్మయ్య సతీమణి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. దాసరి ఉపేంద్ర రాకేష్ నాన్న ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శిలు తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కువరి దేవేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, నాయకులు తక్కురి శేఖర్, నరేందర్, విజయ్, రవి, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు మానాల మోహన్ రెడ్డి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES