నవతెలంగాణ-కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున మానాల మోహన్ రెడ్డికి సుంకేట రవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, మండల కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, మండల పార్టీ జనరల్ సెక్రెటరీ సుంకట శ్రీనివాస్, మండల పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ కౌడ శైలేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరు గణేష్ గౌడ్, నాయకులు సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



