Magazines

చలికాలం చంటిబిడ్డలకు....

15 నిమిషాల క్రితం

winter
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

చలికాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్‌ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్‌ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి. శీతాకాలంలో మసాజ్‌కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్‌ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్‌ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్‌ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే. మసాజ్‌ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. మసాజ్‌కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్