Magazines

పెసరపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు...

58 నిమిషాల క్రితం

Health benefits
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

మనం రోజూ తినే ఆహారాల్లో పప్పు తప్పనిసరిగా ఉంటుంది. అందులోనూ మన వాడకంలో కందిపప్పు ఎక్కువ. వీకెండ్ తినే నాన్ వెజ్ కర్రీస్ కంటే, మిగిలిన రోజుల్లో కూరగాయల కంటే ఎక్కువగా తినే ఆహార పదార్ధాల్లో ముఖ్యమైనది ఇది. పప్పు లేదంటే దాని స్థానంలో సాంబార్. అయితే ప్రోట్రీన్స్ మెండుగా ఉంటే ఈ పప్పును పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఇష్టంగానే తింటారు. పప్పు, చారు, సాంబర్ ఏం వండుకున్నా పెసరపప్పు చాలా శ్రేష్ణమైనదని నిపుణులు సూచిస్తున్నారు. పెసరపప్పుతో గుండె ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ దాకా.. ఎన్నో లాభాలు ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. పెసరపప్పులో ప్రొటీన్లు ఎక్కువ. ముఖ్యంగా శాకాహారులు పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. అప్పుడప్పుడు మాత్రమే తీసుకునే ఈ పప్పును రెగ్యులర్ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పెసరప్పులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలక పోషకాలు, విటమిన్‌-B పూర్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్-C, E.. చర్మం నిగారించేలా చేస్తాయి. ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పుతో అందే కేలరీలు తక్కువ. కనుక బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్. పొట్టుతో కూడిన పెసరపప్పు, పెసర్లతో శరీరానికి ఫైబర్ అందుతుంది. అది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్