Magazines

బియ్యంపిండి ఫేస్ ప్యాక్‌తో..

1 గంట క్రితం

rice flour face
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం


బియ్యం పిండిలోని యాంటీఆక్సిడెంట్లు టాన్‌ తొలగించడానికి సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో ఒక టీస్పూన్‌ తేనె, స్పూన్‌ రోజ్‌ వాటర్‌ వేసి.. పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని టాన్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10 - 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్స్‌ కోసం వారానికి రెండు సార్లు అప్లై చేసుకోండి.

చర్మం పొడిబారితే..

చర్మం మృదువుగా మారడానికి బియ్యం పిండి సహాయపడుతుంది. బియ్యం పిండి చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది, కరుకుదనాన్ని తగ్గిస్తుంది, చర్మం కాంతివంతంగా మారుస్తుంది. మీ చర్మాన్ని మృదువుగా మార్చడానికి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిలో రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జు, ఒక స్పూన్‌ కీర దోస గుజ్జు వేసి.. పేస్ట్‌లా చేయండి. వీటిని బాగా మిక్స్‌ చేసి.. పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. మంచి రిజల్ట్స్‌ కోసం.. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ అప్లై చేసుకోండి.

మెరిసే చర్మం కోసం..

ప్రకాశవంతమైన చర్మం కోసం.. టమాటా పేస్ట్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ బియ్యం పిండి, స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ వేసి.. మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయండి. దీన్ని 15 - 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్