Magazines

ఒత్తిడి నుండి బయటపడాలంటే..

1 రోజు క్రితం

To get relief from stress...
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

ఒత్తిడి కారణంగా సౌందర్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టే ఇలాంటి మానసిక సమస్యలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది. ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలతో మనసంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు ఏ పనైతే ఇష్టంగా చేయాలనిపిస్తుందో ఆ పనిలో బిజీగా మారిపోమంటున్నారు నిపుణులు. తద్వారా మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఏదో తెలియని సంతృప్తి కలుగుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో డార్క్‌ చాక్లెట్, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, చామొమైల్‌ టీ.. వంటివి చక్కగా పనిచేస్తాయట! వీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లే అందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఒత్తిడిని కలుగజేసే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచడంలో వ్యాయామం, యోగా, ధ్యానం.. వంటివి చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అందుకే రోజూ ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట పాటు మీకు నచ్చిన వ్యాయామాలు చేయాలంటున్నారు. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు సమయం గడిపి చూడండి.. మంచి ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్