Monday, May 19, 2025
Homeతాజా వార్తలుశివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు..మనోజ్ కామెంట్స్ వైరల్

శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు..మనోజ్ కామెంట్స్ వైరల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించారు. ఐతే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను ఏలూరు లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ వేడుకలో మంచు విష్ణు పై మంచు మనోజ్ మాట్లాడిన పరోక్ష మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ, మనోజ్ ఏం మాట్లాడారు అంటే.. ‘శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ మనోజ్, విష్ణు పై పరోక్ష విమర్శ చేశారు.
మనోజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి. ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్లొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్నీ రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ.. నాకు ఆ శివుడు ఫ్యాన్స్‌ రూపంలో వచ్చి.. ఇంటి బయట 20 కార్లు పెట్టించాడు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నాకు ఎవరి మీద కోపం రావడం లేదు. అది నా బలహీనతో.. వారి బలమో అర్థం కావట్లేదు. నా కట్టె కాలేవరకూ నేను మోహన్‌బాబు కుమారుడినే. చిన్నప్పటినుంచి నీతి, న్యాయం వైపు నిలబడాలని నూరిపోసి పెంచారు. ఇప్పుడు అదే పని చేస్తుంటే తప్పు అంటున్నారు’’ అని మంచు మనోజ్‌ ఎమోషనల్‌ అవుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -