నవతెలంగాణ – మల్హర్ రావు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశారపు నరేశ్ మాదిగ పిలుపునిచ్చారు.సోమవారం మండల కేంద్రమైన తాడిచేర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు వికలాంగులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మందకృష్ణ మాదిగ భూపాలపల్లి జిల్లాకు రాబోతున్నారని తెలిపారు.పింఛన్ పెంపు పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేయడానికి వికలాంగులు,వృద్దులు,వితంతువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్లవేన రాజేంద్రప్రసాద్,మీసాల లక్ష్మయ్య,ఇందారపు సుమన్,రేపాల లింగయ్య,కేసారపు రమేష్,రేపాల శరత్,సత్తయ్య,శంకరయ్య,శశిధర్ రావు పాల్గొన్నారు.
మందకృష్ణ మాదిగ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES