నవతెలంగాణ- రాయపోల్
రాయపోల్ మండల స్థాయి 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలను విజయవంతం చేద్దామని మండల విద్యాశాఖ అధికారి సతనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సన్నాహా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 1, 2 తేదీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ క్రీడా పోటీలలో అండర్ -14 మరియు అండర్ -17 కేటగిరీల లో బాల బాలికలు పాల్గొంటారు. మండల స్థాయి ఖో – ఖో , కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనే విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించి రాణించే విధంగా చూడాలన్నారు. మిగతా వివరాలకు ఎస్ జి ఎఫ్ మండల కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ని 9866504089 ద్వారా సంప్రదించవలసిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, పావని, అనీఫ్, రవి,మమత తదితరులు పాల్గొన్నారు.
మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES