నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆటల పోటీలను మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ దివ్యాంగుల ఆటలు అంటే దివ్యాంగుల కోసం నిర్వహించే క్రీడా పోటీలు. వారిలోని ప్రతిభను గుర్తించడానికి ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంచుకోవడానికి అలాగే వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడానికి వారు సాధారణ ప్రజలతో సమానంగా ఉన్నారనే విషయాన్ని తెల్పడానికి ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని శ్రీహరి తెలిపారు. ఈ క్రీడా పోటీలతోపాటు, ఫిజియోథెరపీ క్యాంపును డాక్టర్ స్వాతి నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీ నాడు దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని ప్రత్యేక ఉపాధ్యాయులు పెంటయ్య, విజయ్, సాయన్న తెలిపారు. దివ్యాంగుల దినోత్సవం ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులకు వారు కోరారు.
దివ్యాంగులకు మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


