నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని హై స్కూళ్లు, అప్‌పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మండల స్థాయి సమావేశం బుధవారం మధ్యాహ్నం మండల వనరుల కేంద్రం (MRC)లో జరిగింది. ఈ సమావేశాన్ని మండల విద్యా అధికారి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వారీగా అనేక అంశాలపై సమీక్ష చేపట్టారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), AXL–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, UNNATHI (LIP) కార్యక్రమం (6వ–9వ తరగతులు) పై సూచనలు ఇచ్చారు. SSC ఫలితాలు, 2025–26 సంవత్సరానికి చర్యలు, APAAR Generation Status తదితర అంశాలపై చర్చించారు.
అలాగే కొత్త ప్రాథమిక పాఠశాలల ప్రారంభం, ప్రీ-ప్రైమరీ విభాగాలు, ఈ సంవత్సరం ప్రారంభం కాని సున్నా ప్రవేశాల పాఠశాలలు, విద్యార్థుల హాజరు (FRS Attendance), ఆరోగ్య పరీక్షలు, మిడ్ డే మీల్ (MDM) ఆహార నమూనాల సేకరణ, భవిత కేంద్రాలు, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, UDISE 2024లో ఉన్న మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలపై చర్చించారు.
తదితరంగా టాస్ ఉల్లాస్, టీచర్ ట్రైనింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల (AAPC) పనులు, Inspire Manak, టీచర్ అవార్డులు, పాఠ్యపుస్తకాలు.. నోట్‌బుక్స్యూ..యునిఫాంలు ఆన్‌లైన్ స్థితి, పాఠశాలల పర్యటనలు (DEO/MEO/CHMs), IFBS–ఇంటర్నెట్ కనెక్టివిటీ, పీఎం శ్రీ స్కూళ్లు, వనమహోత్సవం, KGBV, URS, ఆధార్ వెరిఫికేషన్, UDISE అప్డేషన్ పై కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.