నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన మండల లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షులు చెరుకు పృథ్వీరాజ్ పర్యవేక్షణలో మండల లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా లుక్క గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా నలిమెల రేవతి గంగాధర్, కోశాధికారిగా తెడ్డు రమేష్, ఉపాధ్యక్షులుగా సున్నం మోహన్, నోముల నరేందర్, కోఆర్డినేటర్ గా గోపిడి లింగారెడ్డి, సర్వీస్ చైర్పర్సన్ గా చింత ప్రదీప్, క్లబ్ మెంబర్షిప్ చైర్ పర్సన్ గా ఎండి హైమద్, క్లబ్ మార్కెటింగ్ చైర్ పర్సన్ గా బద్దం రాజశేఖర్, డైరెక్టర్లుగా పాలెపు నర్సయ్య, కనక గంగాధర్, ఏలేటి గంగాధర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన లుక్కా గంగాధర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సంఘంలో చేరిన సభ్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని కోరారు. తమపై నమ్మకం ఉంచి మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు లుక్క గంగాధర్, ప్రధాన కార్యదర్శి రేవతి గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్ లను సభ్యులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.