Friday, January 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అభివృద్ధి పనులను పరిశీలించిన మండలాధికారి

అభివృద్ధి పనులను పరిశీలించిన మండలాధికారి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం మండల అధికారి గంగ సాగర్ రెడ్డి  పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో పలు సమస్యలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన కుబీర్ లో స్మశాన వాటికలో నీటి సదుపాయం, గేట్ తో పాటు గణేష్, దుర్గ మత నిమర్జనం చేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ సాయినాథ్ సూచించారు. అనంతరం అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగుల వివరాలు అడిగి తెలిసికున్నారు.దింతో పాటు ముఖ్యం గా అంగన్వాడీ,ఐకేపీ భావన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సాయినాథ్ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి  విజయ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -