నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా కబడ్డీ విభాగంలో కమ్మర్పల్లి పురుషుల జట్టు పతము స్థానాన్ని సాధించినట్లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం తెలిపారు. వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాల్కొండ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీల్లో కమ్మర్ పల్లి పురుషుల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి గెలుపొందిందన్నారు.
ఈ సందర్భంగా జట్టులోని సభ్యులైన రాజేందర్, కిరణ్, ఆదిల్, భరత్, రాజేశ్వర్, వినయ్ కుమార్, సాయి ప్రసాద్, శశిధర్, శ్రీహర్ష, నవీన్, నర్సింలు, అనిల్, చాణక్య లను ఆయన అభినందించారు. 14న జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ లో కమ్మర్ పల్లి మండలం నుండి రాజేందర్, చాణక్య, భరత్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో మండల జట్టు ప్రథమ బహుమతి సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి, క్రీడాకారులను అభినందించారు.



