నవతెలంగాణ – మల్హర్ రావు: ఇటీవల రెండుమూడు రోజులు వరుసగా ఈదురు గాలివాన బీభత్సం సృష్టించడంతో మండల కేంద్రమైన తాడిచెర్లలో మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉద్యానవన శాఖ కాటారం డివిజన్ అధికారి వై.మణి, వ్యవసాయ శాఖ మండల అధికారి బి.శ్రీజ, వ్యవసాయ విస్తరణ అధికారి అనూషలు ఇటీవల సంయుక్తంగా పిల్డ్ సర్వేలు నిర్వహించారు. తాడిచెర్లలో దాదాపు 200 ఎకరాల మామిడి తోటలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈదురు, వడగాలులతో బీభత్సం సృష్టించడంతో 20 ఎకరాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు రాలినట్లుగా తెలిపారు. ఈ పూర్తి నివేదికను అధికారులు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు పంపినట్లుగా పేర్కొన్నారు.
20 ఎకరాల్లో మామిడి నష్టం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES