టేబుల్ టెన్నిస్ ప్రపంచకప్
న్యూఢిల్లీ : టేబుల్ టెన్నిస్ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బత్ర నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. మకావు వేదికగా జరుగుతున్న పోటీల్లో మనిక బత్ర గ్రూప్ దశలో లిలీ జాంగ్ (అమెరికా)పై 3-2తో (11-7, 11-2, 14-16, 5-11, 11-6) మనిక బత్ర గెలుపొందింది. 43 నిమిషాల మ్యాచ్‌లో మనిక ఉత్తమ ఆటతీరు కనబరిచింది. తెలుగు తేజం ఆకుల శ్రీజ 1-3తో (11-8, 9-11, 13-15, 8-11)తో పోర్చుగల్ అమ్మాయి ఫు యు చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో చైనా అమ్మాయి వాంగ్ మన్యుతో శ్రీజ తలపడనుంది. పురుషుల విభాగంలో మానవ్ టక్కర్ తొలి మ్యాచ్‌లో 0-3తో ఓటమి చెందగా.. నేడు ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌తో పోటీపడనున్నాడు. మహిళలు, పురుషుల విభాగాల 16 గ్రూప్‌ల నుంచి అగ్రస్థానంలో నిలిచిన వారు నాకౌట్‌కు అర్హత సాధించనున్నారు.
మనిక ఆశలు సజీవం
- Advertisement -
- Advertisement -



