Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపంట పొలాల్లోకి మంజీరా బ్యాక్‌ వాటర్‌

పంట పొలాల్లోకి మంజీరా బ్యాక్‌ వాటర్‌

- Advertisement -

నవతెలంగాణ-మనూర్‌
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో సింగూరు జలాశయం నుంచి విడుదల చేసిన వరద నీటితో పాటు కర్నాటక నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌ అంతా మంజీరకు చేరుతుంది. దాంతో మంజీర బ్యాక్‌ వాటర్‌తో పంటపొలాలు మునగడంతో పాటు ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం నదిగడ్డ హొక్రాన గ్రామపంచాయతీ పరిధిలో ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కర్నాటక నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌ భారీగా వదలడంతో పూర్తిగా పంట పొలాలు మునిగిపోయాయని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ తెలిపారు. నీరు ఇండ్ల మధ్యలోకి రావడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పంట పొలాలకు పరిహారం అందించాలని గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -