Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీపాదరావు

మంథని అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీపాదరావు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మంథని అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీపాదరావు వారసుడిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక మతిభ్రమించి బీఆర్ఎస్ దొంగలు మాట్లాడుతున్నారని కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,  ధన్వాడ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు పార్టీలు మారిన వ్యక్తి తెలంగాణ ఉద్యమ కారుడని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మంథని ప్రాంత అజాతశత్రువుగా స్వర్గీయ శ్రీపాదరావు చేసిన అభివృద్ధి నేడు కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, ఓడేడు బ్రిడ్జి ఎవరి పాలనలో నిర్మించారో…? నాణ్యత లోపాలతో కూలిపోవడం కనిపించలేదా అని గుర్తు చేశారు.

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ నాయకుడు చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించి వచ్చే డబ్బులు ఎటు వెళుతున్నాయో, ఎక్కడి నుండి వస్తున్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్ పాలనలో రౌడీయిజం, గుండాయిజం, హత్యలు ప్రజలు ఇంకా వాటిని మర్చిపోలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత బంధు లాంటి స్కీముల నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంథని జేఎన్టీయూ కాలేజీలో ఎంత మంది దళిత బహుజన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించారో, ఎంతమందిని ఉద్యోగాల నుండి తీసేశారు, జేఎన్టీయూలో అవినీతి జరిగిన సందర్భాలను కూడా గుర్తు చేశారు.

ఇప్పటికైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ధన్వాడ సర్పంచి చీటూరి మహేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ డివిజన్ నాయకుడు సుందిళ్ల ప్రభుదాస్, కొండ్ర శివ కృష్ణ, బొడ్డు రాజశేఖర్, బీరెల్లి మహేష్,నిమ్మల సుధాకర్, గుంటి చందు, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ రహీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -