Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

మంత్రి సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో మహిళా డిగ్రీ కళాశాలలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన మహిళా డిగ్రీ కళాశాల వద్ద బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులకు మంచినీటి ఎద్దడి తీర్చేందుకుగాను మంత్రి వెంటనే స్పందించి బోరు నిర్మాణానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి హరి నందన్ రావు, మాజీ ఎంపిటిసి సభ్యుడు పాండు స్థానిక ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -