Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తుతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం..

మత్తుతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం..

- Advertisement -

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..
సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: మాదక ద్రవ్యాల దుష్పరిణామాలతో కుటుంబాలు కోలుకోలేకుండా పోతాయని,మత్తు పదార్థాలతో జీవితం చిన్నాభిన్నం అవుతుందని, మాదక ద్రవ్యాల వినియోగం చట్టప్రకారం నేరమని, దానికి కఠిన శిక్ష  ఉంటుందని యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  అవగాహన కార్యక్రమన్ని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాలతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలను వివరించారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించండి – హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత అని, జీవించు, జీవించనివ్వు – రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్లి లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయని, మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు షీ టీం నంబర్ 8712659795 లేదా డాయల్ 100 కు కాల్ చేయాలన్నారు. మొబైల్ పోగొట్టినపుడు. మొబైల్ దొంగిలింపు/పోయిన సందర్భంలో  సిఈఐఅర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చని, పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవల కోసం డాయల్ 100 ఉపయోగించాలని, ఆన్లైన్ మోసాలు,  సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని – ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయాలని సూచించారు.
సామాజిక సమతా సందేశం: అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించబడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అద్యాపాకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -