- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
అనారోగ్యంతో మరణించిన దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన నాందిరి ఎల్లవ్వ కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్ సహకారంతో మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ రూ.7 వేలను, అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ సహకారంతో 50 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. వారి వెంట కొండల్ రెడ్డి, ప్రభాకర్, కుమార్, సత్యనారాయణ, నాగరాజు, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు ఇనుప రవి, కంకణాల చంద్రం, దేవయ్య, అలీ పలువురున్నారు.
- Advertisement -