కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నాయకులు చేరారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి ఆహ్వానించారు. జాగృతి నాయకులు గోపు సదానందం, పడాల మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శర్మన్, సురేశ్ రామారావు, సతీశ్, అనిల్, రాజు, బాలకృష్ణ, కృష్ణా నాయక్, రాములు తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలి
గ్రామీణ వైద్యులపై దాడులను ఆపాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎండీ హుస్సేన్, నాయకులు నర్సింహా ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు గ్రామీణ వైద్యులు కల్వకుంట్ల కవితను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికిపైగా గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తున్నామని తెలిపారు. అయినా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు తరచూ తమ హెల్త్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. కవిత స్పందిస్తూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని, వారి సేవలకు తగిన గుర్తింపునివ్వాలని కోరారు.
తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES