నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మైబాపూర్ గ్రామంలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ మిషిన్ లో భాగంగా రైతులతో కలిసి శనగ పంటలను క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామంలోని రైతులు పండిస్తున్న శనగ పంటను క్షుణ్ణంగా పరిశీలించారు. పంటల పరిస్థితులపై, దిగుబడి విషయాలను రైతులతో ఆమె మాట్లాడి తెలుసుకున్నారు.
ఎకరానికి 7 క్వింటాళ్ల శనగ పంట దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. పంట కోత దశలో ఉంది. మంచి దిగబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. మండలంలోని మై బాపూర్ గ్రామంలోని ఎంపిక చేసిన ఉత్సాహ వంతులైన రైతులు ఎంపిక చేసి వెరైటీ పేరు: NBeG 47 (ఎన్ బి జి 47 రకం) విత్తనాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా రైతులకు అందించారు. సేంద్రియ, ఎరువులైన నీమాయిల్ ( వేప నూనె) వంటి మందులను కూడా ఉచితంగా ఇచ్చామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారినితో పాటు గ్రామానికి చెందిన ఉత్సాహవంతులైన రైతులు తదితరులు పాల్గొన్నారు.



