Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్2వ మహాసభను జయప్రదం చేద్దాం 

2వ మహాసభను జయప్రదం చేద్దాం 

- Advertisement -

30వ తేది జిల్లా కేంద్రంలో మహాసభ
గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మోతిరామ్ నాయక్ 
నవతెలంగాణ-రామారెడ్డి 

గిరిజన సంఘం జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు మోతి రామ్ నాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని జగదాంబ తండాలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి, మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ… భవిష్యత్తులో గిరిజన హక్కుల కోసం, భూ సమస్యల కోసం, పోడు భూమి హక్కుల కోసం మహాసభలో చర్చలు జరుగుతాయని, ఈనెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలో గిరిజనులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సభకు రాష్ట్ర నాయకులు ధర్మానాయక్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు మోహన్ నాయక్, దేవి సింగ్, నరాల నాయక్, ఉద్యా నాయక్, తాండ పెద్దలు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -