Saturday, April 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..!

మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇప్పుడు మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జులై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు స‌వ‌రించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా అదనపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ డేటాలో ఏవైనా లోపాలుంటే ఈ నెల 23వ తేదీలోగా నివేదించాలని, ఆ తర్వాత ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -