నవతెలంగాణ – హైదరాబాద్; భానుడి భగభగలతో తెలంగాణ విలవిలలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భగ్గున మండే ఎండలకు తోడు.. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు తీవ్రమైన వడగాలుల కారణంగా అల్లాడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం వడగాలుల ప్రభావంతో సలసలా కాగిపోతోంది. దహేగాం, సిర్పూర్(యు) మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు మండలాల్లో వేడి గాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
తెలంగాణ భానుడి భగభగ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



