నవతెలంగాణ – హైదరాబాద్ : జార్ఖండ్ సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అనూజ్ దా అలియాస్ సహదేవ్ మహతో అలియాస్ సుభాష్‌తో పాటు ఆయన భార్య, అదే స్థాయికి చెందిన నటాషా మరణించారు. ఈ ఎన్కౌంటర్ ఈ వారంలో జరిగిన రెండవ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీభాగ్ జిల్లా కుథాన్ గ్రామం కాగా, నటాషా అలియాస్ మహేశ్వరి హోడి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండు యువతి. 2007లో పార్టీలోకి రిక్రూటు కాగా, ఆ తర్వాతికాలంలో జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లింది. ఆ సమయంలో తను డివిజన్ కమిటీ సభ్యురాలి స్థాయిలో పనిచేసింది కనుక ప్రస్తుతం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలై ఉంటుందని మాజీ మావోయిస్టు వర్గాలు వెల్లడించాయి.
భారీ ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



