నవతెలంగాణ-మద్నూర్
సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్దరించాలనీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ఉద్యోగులు తహశీల్దార్ కార్యాయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నకల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు రవికుమార్ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దుచేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1వ పిఆర్సి ప్రకటనను వెంటనే అమలు చేయాలనీ, పెండిండ్ డీఏలను వడ్డీతో సహా చెల్లించాలని కోరారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల నాయబ్ తహశీల్దార్ లు ఖలీద్, శివ రామకృష్ణ, గిర్దావర్ మురళిధర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బాలరాజు , కావేరి, ప్రవీణ్, దశరథ్, జిపిఓ ల మండల అధ్యక్షులు సత్యం, నాయకులు సంతోష్, బాబు, సురేష్, నర్సింలు, రంజిత్, సంగమ్మ, మండల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.



