నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సీఎన్ ఎన్(CNN) ఎంఎస్ నౌ(MS NOW), పొలిటికో(POLITICO) అనే మూడు న్యూస్ మీడియాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నారనే సాకుతో సదురు న్యూస్ సంస్థలను బ్యాన్ చేస్తున్నట్లు వైట్ హౌస్ అధికారులు ఆదివారం ప్రకటించారు. తాజాగా ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ మూడు మీడియ సంస్థలు ఆ దేశ కోర్టును ఆశ్రయించాయి. ఏకపక్షంగా, మీడియా స్వేచ్చకు విఘాతం కలిగేలా ట్రంప్ యంత్రాంగం వ్యవహరిస్తోందని పిటిషన్ లో సదురు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ట్రంప్ సర్కార్ తమపై ఆంక్షలు విధించిందని ఆందోళన వ్యక్తం చేశాయి.
ట్రంప్ చర్య పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని, స్వతంత్ర జర్నలిజాన్ని ప్రభుత్వ జోక్యం నుండి విముక్తం చేసేందుకే డీసీ డిస్ట్రిక్ట్ కోర్టులోని పిటిషన్ దాఖలు చేశామని, ఈ చర్యను సవాలు చేయకుండా వదిలేస్తే, ఇది పత్రికా స్వేచ్ఛకు, ప్రభుత్వ జోక్యం లేని స్వతంత్ర జర్నలిజం పొందే ప్రజల హక్కుకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నాయి.రాబోయే రోజుల్లో ప్రభుత్వ అధికారులు విచారణను, న్యాయపరమైన వాదనలను ఎదుర్కొనే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది.



