నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రాజ్య తండా గ్రామపంచాయతీలో ఒంటె గుడిసె తండాకు చెందిన బానోతు పంతులు, బానోతు బాలు మా భూమి మేమే కాస్తు చేసుకున్నప్పటికీ పట్టాలో వేరే వ్యక్తి పేరు ఉందనీ, మా భూమి మా పేరా లేనందున మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని, పట్టాను రద్దుచేసి మా పేరా పట్టా చేసి మాకు న్యాయం చేయాలని సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బానోతు బాలుకు సంబంధించిన భూమి సర్వే నెంబర్ 93/బి/2లో ఒక ఎకరం ఏడు గుంటల భూమిని నేను గతంలో కొనుగోలు చేశానని, అది ఇప్పటివరకు మేమే కాస్తులో ఉండి వ్యవసాయం సాగు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బానోతు పంతులు ఒక ఎకరం ఏడు గుంటల భూమి వేరే రైతు నల్ల కృష్ణారెడ్డి వద్ద కొనుగోలు చేశామని వివరించారు. మేము నల్ల కృష్ణారెడ్డి వద్ద కొనుగోలు చేసిన కాగితాలు ఇప్పటికి ఉన్నాయని, మేము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వ్యవసాయం అదే భూమిలో చేస్తున్నామని పేర్కొన్నారు.
కానీ ఆ సర్వే నెంబర్ పై ఉన్న భూమిని మేము పట్టా చేసుకుందామంటే పట్టా కావడం లేదని తెలిపారు. భూ రికార్డులను పరిశీలించగా వేరే వ్యక్తి పేరా పట్టా అయ్యి ఉన్నదని అన్నారు. వెంటనే సంబంధిత అధికారిని కలిసి చెప్పామనీ, అయినా మాకు న్యాయం జరగలేదని తెలిపారు. అక్రమంగా పట్టా చేయించుకున్న నల్ల విధిస్తా రెడ్డిపై చట్టమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు చేశామని స్పష్టం చేశారు.



