నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోనే సంచలనం రేకెత్తించిన మావో యిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ అంతక్రియలు స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో ఆదివారం ముగిసాయి. ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌం టర్ లో మృతి చెందిన సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణే ష్ పార్థివదేహాన్ని చట్టపరమైన ప్రక్రి యలు పూర్తైన అనంతరం నల్లగొం డ జిల్లా చండూరు మండలం పు ల్లెంల గ్రామానికి తరలించారు పుల్లెంల గ్రామంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. పా క హనుమంతు అలియాస్ గణేష్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకో వడంతో గ్రామంలో పోలీసులు భద్ర తను కట్టుదిట్టం చేశారు. పార్థివదేహం గ్రామానికి చేరుకో గా నే భారీ సంఖ్యలో పోలీసు బలగా లు మోహరించాయి. గ్రామ ప్రవేశ మార్గాలు, ముఖ్య కూడళ్ల వద్ద క ట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేప ట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు జరగకుండా పోలీసులు ని రంతర పర్యవేక్షణ కొనసాగించారు. భద్రతా చర్యల నడుమ గణేష్ అంత్యక్రియలకు సంబంధించిన ఏ ర్పాట్లు జరిగాయి.
అంత్యక్రియలు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలోనే జరిగాయి.. పార్థివదేహా న్ని చూసేందుకు సమీప గ్రామాల నుంచి గుంపులు గుంపులుగా ప్రజ లు తరలివచ్చారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధు వులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. 1961లో జన్మించిన గణేష్, విద్యా ర్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. డిగ్రీ చదువు తున్న సమయంలో రాడికల్ విద్యా ర్థి సంఘాలతో సంబంధాలు ఏర్ప డిన గణేష్ సుమారు 45 సంవత్స రాల క్రితం మావోయిస్టు ఉద్యమం లో చేరాడు. ఆ తరువాత స్వగ్రా మాన్ని విడిచి వెళ్లిన గణేష్, దశా బ్దాల పాటు కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించ లేదని అధికారులు తెలిపారు. కాల క్రమేణా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగిన అతడు, సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమి టీ సభ్యుడిగా కీలక బాధ్యతలు ని ర్వహించాడు. భద్రతావర్గాల సమా చారం ప్రకారం గణేష్‌పై ఒడిశా, ఛత్తీ స్‌గఢ్, తెలంగాణ సహా పలు రా ష్ట్రాల్లో కోటి నుంచి ఐదుకోట్ల రూ పాయల వరకు రివార్డులు ప్రకటించ బడ్డాయి.
దండకారణ్య అటవీ ప్రాంతాల్లో మా వోయిస్టు నెట్‌వర్క్ విస్తరణలో గణే ష్ కీలక పాత్ర పోషించిన ట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు. గ తంలో పలుమార్లు గణేష్ మృతి చెందినట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఈసారి మృతదేహాన్ని కుటుంబ స భ్యులు గుర్తించడంతో పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. గణే ష్ పార్థివదేహం స్వగ్రామానికి చేరు కోవడంతో పుల్లెంల గ్రామం మొత్తం విషాదంలో మునిగింది. గ్రామస్తులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుం టూ భావోద్వేగానికి లోనవుతున్నా రు. మృతదేహాన్ని గుర్తించిన గణేష్ సోదరుడు, ఇతనే తమ కుటుంబ సభ్యుడని అధికారులకు నిర్ధారించి నట్లు సమాచారం. గత 45 ఏళ్లుగా తమకు గణేష్‌తో ఎలాంటి సంబం ధాలు లేవని కుటుంబ సభ్యులు తె లిపారు. పుల్లెంల గ్రామంలో శాంతిభద్రతల ను కాపాడేందుకు పోలీసులు పూర్తి అప్రమత్తతతో ఉన్నారు. గ్రామ పరి సరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏ ర్పాట్లు కొనసాగుతున్నాయి. దశా బ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న నేత గణేష్ మృతి, మావోయిస్టు నెట్‌వర్క్‌కు గణనీ యమైన ఎదురుదెబ్బగా భద్రతా వ ర్గాలు అంచనా వేస్తున్నాయి. మొ త్తానికి అంత్యక్రియలు ప్రశాంతంగా ముగియండoతో అంతా ఊపిరి పీ ల్చుకున్నారు.



