Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమావోయిస్టు దంపతుల లొంగుబాటు

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

- Advertisement -

– రాచకొండ కమిషనర్‌ ఎదుట హాజరు
– 45 ఏండ్లుగా మావోయిస్టుగా పనిచేసిన సంజీవ్‌..
– ఒక్కొక్కరిపై రూ.20 లక్షల రివార్డు
నవతెలంగాణ -హయత్‌నగర్‌

దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న మావోయిస్టు దళ సభ్యులు, దంపతులు మాల సంజీవ్‌ అలియాస్‌ లెంగు దాదా, పెరుగుల పార్వతీ అలియాస్‌ దీనా వయోభారంతో గురువారం రాచకొండ సీపీ డాక్టర్‌ సుధీర్‌ బాబు ఎదుట లొంగిపోయారు. పూర్వవైభవాన్ని వీడి ప్రజా స్రవంతిలో చేరిన ఈ దంపతులు ఒక్కొక్కరిపై రూ. 20 లక్షల చొప్పున రివార్డు ఉండటం గమనార్హం. ఈ మేరకు ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో కమిషనర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 379 మంది మావోయిస్టులు లొంగిపో యినట్టు తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌ నివాసి అయిన మాల సంజీవ్‌ అలియాస్‌ లెంగు దాదా 1980లో సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌లో చేరి గద్దర్‌కు ముఖ్య అనుచరునిగా, దళ సభ్యునిగా పని చేశారు. ప్రస్తుతం డీకేఎస్‌డీసీ సెక్రటేరియట్‌ మెంబర్‌గా ఉన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు (ఎస్‌సీఎం, డీకేఎస్‌జెడ్‌సీ), చైతన్య నాట్య మంచ్‌(డీకేఎస్‌జేడీసీ) సాంస్కృతిక ఉప సభ్యులు దీనా 1992లో మావోయిస్టు పార్టీలో చేరారు.

పోరు వద్దు- ఊరు ముద్దు : రాచకొండ సీపీ
మావోయిస్టులు పోరుబాటను వీడి ఊరు వాడ పట్టాలని రాచకొండ సీపీ డాక్టర్‌ సుధీర్‌ బాబు మావోయిస్టు నేతలకు సూచించారు. అజ్ఞాత మావోయిస్టులు నక్సలిజాన్ని వదిలి వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి నగదు రివార్డు, పునరావాసం, సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు జనం నుంచి కూడా సహకారం అందుతుందని, అందుకు తగు చర్యలు చేపడతామని తెలిపారు. కొంతమంది ప్రజాసంఘాల ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవం తులుగా వ్యవహరి స్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక కార్య క్రమాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా తగ్గిపో యిందని చెప్పారు. చదువుకున్న వారు ఎవరూ మావోయిస్టు పార్టీలో చేరడం లేదన్నారు. అనేక దేశాల్లో ఈ మావోయిజం కనుమరు గైపోయిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ షాకీర్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -