Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ నేతను చంపేసిన మావోయిస్టులు

బీజేపీ నేతను చంపేసిన మావోయిస్టులు

- Advertisement -

బీజాపూర్‌ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఎలిమిడి పోలీస్‌ స్టేషన్‌ పరిధి దండకారణ్య ప్రాంతం ముంజల్‌ కంకేర్‌ నివాసి, బీజేపీ నాయకులు సత్యం పూనెంను మావోయిస్టులు సోమవారం రాత్రి హత్య చేశారు. సమాచారం అందుకున్న బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ దర్యాప్తు ముమ్మరం చేశారు. బీజాపూర్‌ జిల్లాలోని ఇల్మిడి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. సత్యం పూనెంకు బీజాపూర్‌ జిల్లా మాజీ మంత్రి మహేష్‌ గగ్డా నివాళులు అర్పించారు. ఆయన మృతి బీజేపీకి తీరని నష్టం అని అన్నారు. ఈ ప్రాంతంలోని యువతను క్రీడల్లో ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేయడం చాలా విచారకరమని ఫేస్‌బుక్‌ వేదికగా తెలియజేశారు. కాగా, పూనెం మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీకి చెందిన మద్దేడ్‌ ఏరియా కమిటీ ఒక కరపత్రం వదిలేసింది. సత్యం పూనెం పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని, మూడుసార్లు హెచ్చరించామని పేర్కొంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -