Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

ఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

తక్షణ సహాయం అందజేత

నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81, 141 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ అధికారులు చేపడుతున్న ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆరుగురు మావోయిస్టు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ”ఆపరేషన్‌ చేయూత” కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం జనవరి-2025 నుంచి ఇప్పటివరకు వీరితో కలిపి 326 మంది మావోయిస్టు దళసభ్యులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఆరుగురిలో కునజం పాపారావు అలిమాస్‌ దినేష్‌, లక్మా బండి అలియాస్‌ శాంతి, మడివి కోస, పద్దం లక్మా అలియాస్‌ గుడ్డి, మడివి లక్మా, దొడ్డి బద్రు ఉన్నారన్నారు. వారికి తక్షణ సహాయంగా రూ.25 వేల చొప్పున మొత్తం రూ.1,50,000 ఇచ్చామని ఎస్పీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -