- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మందికి పైగా మావోయిస్టులు శుక్రవారం నాడు లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ వివరాలను డీజీపీ వెల్లడించనున్నారు. లొంగిపోనున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులు, బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోధి కేశాలు ఉన్నారు. వీరు సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించనున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ కూంబింగ్ తీవ్రతరం కావడంతో వీరు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
- Advertisement -



