– యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవోస్) సెంట్రల్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మారం జగదీశ్వర్, డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు మూడేండ్ల పాటు(2029 వరకు) కొనసాగనున్నారు. కాగా ఎలాంటి పోటీ లేకుండా వారు తిరిగి ఎన్నికవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత పదవీ కాలంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో, వారి సంక్షేమం కోసం ఈ ద్వయం పోషించిన పాత్ర అభినందనీయం. వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వంతో జరిపిన కీలక చర్చల్లో వీరు చూపిన చొరవ ఉద్యోగ సంఘాల చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు రెండోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్, డాక్టర్ ముజీబ్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, వేలాది మంది ఉద్యోగ సోదర సోదరీమణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గెలుపు మీ నిబద్ధతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని వారు కొనియాడారు. ఉద్యోగ సంఘం పట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, అందరినీ కలుపుకుపోతూ, సంఘాన్ని బలోపేతం చేస్తున్నందుకు కేంద్ర సంఘం బాధ్యులకు ఉద్యోగ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
టీఎన్జీవోస్ సెంట్రల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మారం జగదీశ్వర్, డాక్టర్ ముజీబ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



